
అమరావతి, 28 జూన్ (హి.స.)
మేడ్చల్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బోడుప్పల్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో నూతనంగా గృహప్రవేశం చేసిన కుటుంబంపై గంజాయి బ్యాచ్ మూకుమ్మడిగా దాడి చేశారు. సుమారు 40 నుంచి 50 మంది వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నారు. ఇంట్లోకి చొరబడి మహిళలు, చిన్నారులు, వృద్ధులని చూడకుండా విరుచుకుపడ్డారు. కర్రలు, రాళ్లతో విచక్షణరహితంగా దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. దీంతో వేడుక చేసుకుంటున్న ఇంటి వద్ద భీతావహ పరిస్థితి నెలకొంది. గృహప్రవేశానికి వచ్చిన బంధువుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ