
అమరావతి, 28 జూన్ (హి.స.)అడ్డతీగల, ఎల్పీజీ వంటగ్యాస్ సబ్సీడీల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లకు ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియను తప్పనిసరి చేసింది. బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ కార్యక్రమం ఏడాదికిపైగా కొనసాగుతున్నప్పటికీ జిల్లాలో ఇంకా చాలా మంది వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేయలేదు. పోలవరం జిల్లాలో 95 వేల గ్యాస్ కనెక్షన్లు ఉండగా అర్హులైన ప్రతి వినియోగదారుడు ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అడ్డతీగల, న్యూస్టుడే: ఎల్పీజీ వంటగ్యాస్ సబ్సీడీల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లకు ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియను తప్పనిసరి చేసింది. బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ కార్యక్రమం ఏడాదికిపైగా కొనసాగుతున్నప్పటికీ జిల్లాలో ఇంకా చాలా మంది వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేయలేదు. పోలవరం జిల్లాలో 95 వేల గ్యాస్ కనెక్షన్లు ఉండగా అర్హులైన ప్రతి వినియోగదారుడు ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
దగ్గరలోని హెచ్పీ, ఇండేన్, భారత్ గ్యాస్ ఏజెన్సీలను సందర్శించి వినియోగదారులు ఎటువంటి రుసుము చెల్లించకుండా ఈ-కేవైసీ నమోదు చేసుకోవచ్చు. ఆధార్కార్డు, గ్యాస్ కనెక్షన్కు అనుసంధానమైన చరవాణి నెంబర్ ఉంటే ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ