చిన్నారులకు పోలియో చుక్కలు కీలకం
చిన్నారులకు పోలియో చుక్కలు కీలకం
చిన్నారులకు పోలియో చుక్కలు కీలకం


అమరావతి, 28 జూన్ (హి.స.)చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజానికి కృషి చేద్దామని ఆంధ్రప్రదే హోం మంత్రి వంగలపూడి అనిత )వ్యాఖ్యానించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరి అని తెలిపారు. చిన్నారుల ఆరోగ్య రక్షణకు పోలియో చుక్కలు కీలకమని వ్యాఖ్యానించారు. యస్ రాయవరం మండలం సోముదేవుపల్లిలో గ్రామంలో అనిత ఈరోజు (ఆదివారం) పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోం మంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.

సోముదేవుపల్లిలో వరహానది రక్షణ గోడ నిర్మాణ పనులకు అనిత శంకుస్థాపన చేశారు. SDMF రూ.9. 95 కోట్ల నిధులతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. సోమదేపల్లి గ్రామంలో MPUP స్కూల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ధర్మవరం అగ్రహారం సమీపంలో వరహానదిలో నూతనంగా నిర్మించిన పెనుగొల్లు గ్రోయిన్ను హోం మంత్రి అనిత ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande