3 నెలలో.400 వందల సెల్ ఫోన్ స్వాధీనం
3 నెలలో.400 వందల సెల్ ఫోన్ స్వాధీనం
3 నెలలో.400 వందల సెల్ ఫోన్ స్వాధీనం


అమరావతి, 28 జూన్ (హి.స.)

మచిలీపట్నం క్రైం, : సెల్ఫోను ద్వారా రోజువారీ నిర్వహించే కార్యక్రమాలు దాన్ని పోగొట్టుకుంటే వెంటనే స్తంభించిపోతాయి. తిరిగి గాడిన పడాలంటే ఎంత సమయం పడుతుందో కూడా ఊహించలేం. ఫోన్లు పోగొట్టుకున్న వారిలో దాదాపు 70 శాతానికి పైగా వెంనే ఫిర్యాదు చేస్తున్నారు. వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో పోలీస్శాఖ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) పోర్టల్ ద్వారా వాటి రికవరీ ప్రక్రియను వేగవంతం చేసింది.

:బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలనే లక్ష్యంతో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్వీయ చొరవతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని సీసీఎస్ స్టేషన్ల సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది సమన్వయంతో సీఈఐఆర్ పోర్టల్ను సద్వినియోగం చేసుకుంటూ పోయిన సెల్ఫోన్ల ఐఎంఈఐ వివరాలను గుర్తించారు. మూడు నెలలు కృషి చేసి రూ.60 లక్షల విలువ చేసే 400 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా 237 గుడివాడ సీసీఎస్ స్టేషన్ పరిధికి చెందినవి. మచిలీపట్నం సీసీఎస్ 100, పెనమలూరు సీసీఎస్కు సంబంధించి 63 ఫోన్లు ఉన్నాయి.

:రికవరీ చేసిన ఫోన్లను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ బాధితులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ మరో 500 ఫోన్ల ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు తుది దశలో ఉన్నాయని త్వరలో వాటిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్న వారు వెంటనే సమీప స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande