హైదరాబాదు నగర శివారు లోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ లో హరితవనం ఏర్పాటు
హైదరాబాదు నగర శివారు లోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ లో హరితవనం ఏర్పాటు
హైదరాబాదు నగర శివారు లోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ లో హరితవనం ఏర్పాటు


హైదరాబాద్, 28 జూన్ (హి.స.)

నగర శివారులోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో ‘హరితవనం’ ఏర్పాటుకు కార్యాచరణ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 18న శంకుస్థాపన చేసిన అనంతరం అటవీశాఖ అధికారులు ప్రతిపాదిత నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. సైక్లింగ్ ట్రాక్లు వాక్వేలు, ధ్యానమందిరాలు... సమావేశాల నిర్వహణకు వేదికలు.. కూర్చుని మాట్లాడుకునేందుకు పచ్చిక బయళ్లలో బెంచీలు... అత్యాధునిక సౌకర్యాలతో బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కును తలపించేలా రూపొందించనున్నారు. రూ.15 కోట్ల వ్యయంతో ఈ ఏడాది డిసెంబరు లోపు పనులు పూర్తిచేయనున్నారు.

ఐదు చోట్ల ప్రవేశ ద్వారాలు

గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ 424 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా... ఇందులో 142 ఎకరాల్లో హరితవనం (ఎకో పార్కు) ఏర్పాటు చేయనున్నారు. రోజుకు 30వేల మంది సందర్శించేందుకు అనువుగా.. యోగా, ధ్యానం, వాకింగ్, సైక్లింగ్ కోసం వచ్చేవారికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఉదయం, సాయంత్రం ఒకే సమయంలో వందలమంది వస్తే.. ప్రవేశ ద్వారాల వద్ద రద్దీ ఏర్పడుతుందన్న అంచనాతో.. ఐదు చోట్ల ద్వారాలను నిర్మిస్తారు. వారాంతాల్లో ఎక్కువసేపు గడిపేవారి కోసం సమావేశ మందిరాలను, పిల్లల కోసం ప్లేజోన్లను సిద్ధం చేస్తారు.

.గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని కొందరు తమ భూములంటూ ఆక్రమించారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఇబ్రహీంపట్నం ఫారెస్ట్ రేంజ్ అధికారి డాక్టర్ కె.శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి కస్నా నాయక్లు న్యాయవాదులను సంప్రదించారు. ప్రైవేటు వ్యక్తులు కోర్టులో సమర్పించిన ధ్రువపత్రాలు నకిలీవని నిరూపించారు. ఆ భూములు అటవీశాఖవేనని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో 116 ఎకరాల భూమిని గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande