భారత ప్రధాని పీ వీ.నరసింహ రావు. 105 జయతి
భారత ప్రధాని పీ వీ.నరసింహ రావు. 105 జయతి
chandra babu


అమరావతి, 28 జూన్ (హి.స.):భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. పీవీ నరసింహారావుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. క్లిష్ట సమయంలో దూరదృష్టితో ఆలోచించి దేశాభివృద్ధికి తోడ్పడ్డారని, భావి తరాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నా. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. భారత అభివృద్ధి దిశను మార్చిన మహానేతగా ఆయన చిరస్మరణీయులు. పీవీ దార్శనిక నాయకత్వం, దేశాభివృద్ధికి చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆ మహనీయుడి పుణ్యస్మృతికి మరొకసారి వినమ్ర నివాళులు' అంటూ ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande