జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
పల్స్ పోలియో కార్యక్రమం ఆరంభం


అనంతపురం, 28 జూన్ (హి.స.)రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జాతీయ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. 0 నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులందరికీ రెండు చుక్కల పోలియో మందును వేయనున్నారు.

ఈరోజు ఆదివారం పోలియో కేంద్రాలకు రాలేకపోయిన వారి కోసం, సోమ, మంగళవారాల్లో (జూన్ 29, 30) వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పిల్లలకు చుక్కలు వేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, మరియు రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక బూత్లను ఏర్పాటు చేశారు.

అనంతపురం జిల్లా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఐదేళ్ల లోపు 76,660 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 469 బూత్లు, 22 సంచార బృందాలు, 77 హైరిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి చిన్నారికి సకాలంలో పోలియో చుక్కలు వేయించాలన్నారు.

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. పోలియో వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి రోగనిరోధక శక్తి పెంచడమే ప్రధాన మార్గం. అందుకోసమే ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ వేయిస్తే.. వైరస్కు వ్యతిరేకంగా రక్షణ ఇచ్చినట్లే అని చెప్తోంది. అందరూ స్పందించి... ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయించండి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande