
తిరుమల , 28 జూన్ (హి.స.)
శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్రౌండర్ తిలకరత్నే దిల్షాన్ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న TG20 లీగ్లో ‘ఖమ్మం ఏసెస్’ జట్టుకు మెంటార్గా వ్యవహరిస్తున్న ఆయన, హైదరాబాద్ షెడ్యూల్ మధ్యలో లభించిన విరామ సమయంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
దిల్షాన్ ఆదివారం ఉదయం విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆయన ధోతి ధరించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలకగా, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలికి వచ్చిన తిలకరత్నే దిల్షాన్ను చూసేందుకు భక్తులు, క్రికెట్ అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీల కోసం పోటీ పడగా, దిల్షాన్ కూడా ఎంతో ఓపికగా నవ్వుతూ అభిమానులకు అభివాదం చేస్తూ సెల్ఫీలు ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi