ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసిన వరంగల్ సీపీ
ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసిన వరంగల్ సీపీ
Cp


వరంగల్, 28 జూన్ (హి.స.)

వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ యం. అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్ఐగా పని చేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్ ఉన్న ఎస్ఐ షేక్ హమీద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇరువురు అధికారులను సస్పెండ్ చేశారు. సీఐ అబ్బయ్య పై గతంలోనూ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో పని చేసినప్పుడు పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పరకాలలో సిఐ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత అతని అవినీతి గురించి తెలుసుకున్న అక్కడి ప్రజా ప్రతినిధి అతని పోస్టింగ్ క్యాన్సిల్ చేయడం జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande