
కడప, 28 జూన్ (హి.స.)
: వైఎస్సార్ జిల్లా బద్వేల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా రఫీ రైస్ మిల్లు సమీపంలో ఉన్న గోదాములో అక్రమంగా నిల్వ చేసిన 610 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యంతోపాటు వాహనాన్ని సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, బద్వేల్ అర్బన్ పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివకుమార్ తెలిపారు. అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తామని ఆయన వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ