పేదల ఇళ్లు కూల్చితే ప్రభుత్వాన్ని కూల్చుతాం: ఎంపీ ఈటల
పేదల ఇళ్లు కూల్చితే ప్రభుత్వాన్ని కూల్చుతాం: ఎంపీ ఈటల
Eetala rajendar


హైదరాబాద్, 29 జూన్ (హి.స.)ఇందిరమ్మ రాజ్యమంటే..ఇళ్లు కూల్చడమా? పేదల ఇళ్లు కూల్చితే ప్రభుత్వాన్ని కూలగొడతాం’ అంటూ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ హస్మత్పేట సర్వే నం.1లో హైడ్రా కూల్చివేతల ప్రాంతాన్ని ఆదివారం సందర్శించిన ఆయన బాధితులతో సమావేశం నిర్వహించారు. సర్వే నం.1లోని భూమిపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ భూమి ప్రభుత్వానిదా? పురావస్తు శాఖదా? ప్రైవేట్దా అన్నది తేల్చాలని ఈటల డిమాండ్ చేశారు. పురావస్తు శాఖ స్థలమైతే..ఇక్కడ లే-అవుట్ వేసి కొన్నేళ్లుగా ప్లాట్లు విక్రయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒకవేళ ప్రభుత్వ స్థలమైతే..భూకబ్జాదారులు..దీనికి సహకరించిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలపై చర్యలెందుకు తీసుకోలేదన్నారు. హైడ్రా పేదలను రోడ్డున పడేస్తూ తన నిజ స్వరూపాన్ని చాటుకుంటోందని దుయ్యబట్టారు. న్యాయస్థానం ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా శనివారం రాగానే హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని ఈటల తప్పుపట్టారు. కూల్చివేతలు ఆపకపోతే పేదలందరినీ ఏకం చేసి 2028 ఎన్నికల్లో గద్దె దింపుతామని స్పష్టం చేశారు. అంతకుముందు పలువురు బాధిత మహిళలు ఎంపీ ఈటలకు తమ గోడు వెళ్ల్లబోసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande