రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు!
రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు!
Farmers


హైదరాబాద్, 29 జూన్ (హి.స.)తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని రైతాంగం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం నిధుల విడుదలకు ఎట్టకేలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రమే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఈ నిధులను నేరుగా జమ చేయనున్నారు. ఈ వానాకాలం సీజన్లో పెట్టుబడి ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande