నందిగామ.మండలం మాగల్లులో 108 అడుగుల లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి మహాకుంభాభిషేకం
నందిగామ.మండలం మాగల్లులో 108 అడుగుల లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి మహాకుంభాభిషేకం
Narsimha


నందిగామ రూరల్:, 29 జూన్ (హి.స.)ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లులో 108 అడుగుల లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహానికి మహాకుంభాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి మహాస్వామి చేతులమీదుగా వైభవంగా నిర్వహించారు. తొమ్మిది పవిత్ర నదీ జలాలతో కుంభాషేకం చేశారు. అనంతరం మహా పూర్ణాహుతి, అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పల్లగిరిపై త్రిశక్తి దేవాలయంలో కూడా మహా కుంభాభిషేకం నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande