జీవితం.. వంద మీటర్ల పరుగు పందెం కాదు: నితిన్ నబీన్
జీవితం వంద మీటర్ల పరుగుపందెం కాదని.. మన ఓపికకు పరీక్ష అని భాజపా జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు.
Nitin


హైదరాబాద్, 29 జూన్ (హి.స.)జీవితం వంద మీటర్ల పరుగుపందెం కాదని.. మన ఓపికకు పరీక్ష అని భాజపా జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వీబీఐటీ క్యాంపస్లో వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాంక్లెవ్లో ఆయన పాల్గొన్నారు. భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. రాజకీయాల్లో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

‘‘చిన్న వయసులోనే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చాక నా భవిష్యత్తుపై గందరగోళంలో పడ్డాను. ఏ పని చేసినా నాదైన ముద్ర ఉండాలని గట్టిగా అనుకున్నాను. అప్పగించిన పనిని నిబద్ధతతో పూర్తి చేయడమే నా బలం. వేగంగా లక్ష్యాలు చేరాలనే ఆరాటంలో నేటి యువత ఉంది. ఏ పనినైనా ఓపిక, నిలకడ, శక్తితో చేసినప్పుడే ఫలితాలు వస్తాయి’’ అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande