పోలీస్ రిక్రూట్మెట్ బోర్డు ముట్టడికి యత్నం.. నిరుద్యోగ జేఏసీ నేతల అరెస్టు
పోలీస్ రిక్రూట్మెట్ బోర్డు ముట్టడికి యత్నం.. నిరుద్యోగ జేఏసీ నేతల అరెస్టు
Jac


హైదరాబాద్, 29 జూన్ (హి.స.)

తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ విషయంలో నిరుద్యోగులు మరోసారి రోడెక్కారు. ఇవాళ డీజీపీ కార్యాలయం ముట్టడికి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రయత్నించింది. ఎస్ఐ, కానిస్టేబుళ్ల నియామకాల కోసం ఐదు నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అలాగే పోలీస్ ఉద్యోగాల్లో పోస్టుల సంఖ్య 5000 నుంచి 20,000 పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపు ఇచ్చింది. నిరుద్యోగుల పిలుపు మేరకు డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరుద్యోగులతో కలిసి ముట్టడికి వస్తున్న జేఏసీ నేతలను డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిరుద్యోగులతో పాటు పలువురు జేఏసీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరుద్యోగులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande