ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు సుద్ద మైన తాగునీరు.అందించేందుకు వాటర్ గ్రిడ్
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు సుద్ద మైన తాగునీరు.అందించేందుకు వాటర్ గ్రిడ్
Water grid


తూర్పుగోదావరి, 29 జూన్ (హి.స.)ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు రూ.1,650 కోట్లతో చేపట్టిన వాటర్గ్రిడ్ పనులు చకచకా సాగుతున్నాయి. గోదావరి నుంచి నీరు తీసుకుని శుద్ధిచేసిన తర్వాత కొళాయిల ద్వారా ప్రజలకు సరఫరా చేయాలన్నదే వాటర్గ్రిడ్ ప్రధాన లక్ష్యం.

ప్రస్తుతం కాలువల ద్వారా ప్రవహించే జలాలు తీసుకుని శుద్ధి చేసిన తర్వాత సరఫరా చేస్తున్నప్పటికీ, కాలువ నీరు కలుషితం అవుతుందనే కారణంగా ప్రజలు తాగడానికి అంతగా ఆసక్తి చూపడంలేదు. ఈ నేపథ్యంలో వాటర్గ్రిడ్ పథకానికి గత ఏడాది ఏప్రిల్లో పరిపాలన ఆమోదం దక్కడంతో, గుత్తేదారు సంస్థ ఆగస్టులో పనులు మొదలుపెట్టింది. మధ్యడెల్టా ప్రాంతంలోని గ్రామాలకు రూ.740 కోట్లు, తూర్పు డెల్టా ప్రాంతంలోని గ్రామాలకు రూ.910 కోట్లు కేటాయించారు. మధ్య డెల్టాకు ధవళేశ్వరం బ్యారేజికి ఎగువన బొబ్బర్లంక వద్ద, తూర్పు ప్రాంత డెల్టా వాసులకు ధవళేశ్వరం వద్ద రెండు భారీ ఇన్టేక్వెల్స్ నిర్మిస్తున్నారు.

--

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande