తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్ల హల్చల్.. తీరంలో హైటెన్షన్
తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్ల హల్చల్.. తీరంలో హైటెన్షన్
coast tension tamilnadu puducherry fishing boats clash local fishermen suchi


నెల్లూరు, 29 జూన్ (హి.స.)నెల్లూరు జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన మరబోట్లు.. తీరానికి అతిసమీపానికి వస్తూ హల్చల్ చేశాయి. కోట మండలం గోవిందపల్లిపాలెం, శ్రీనివాసపురం, బోగోలు మండలం ఇస్కపల్లి పల్లెపాలెం తీరంలో మత్స్యసంపదను దోచుకెళ్లారు. స్థానిక మత్స్యకారులను రెచ్చగొట్టేలా తమిళనాడు, పాండిచ్చేరి జాలర్లు యత్నించారు. రాళ్లు, ఖాళీ సీసాలు విసురుతూ చొరబాటు జాలర్లు దాడులకు తెగపడటంతో.. స్థానికుల వలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

తీర ప్రాంతంలో తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్లు హల్చల్ చేస్తున్నప్పటికీ వాటిని పట్టుకునే పరిస్థితి లేక స్థానికులు చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. సముద్రతీరం వద్ద గస్తీ కోసం ప్రభుత్వం మూడు మరబోట్లని ఏర్పాటు చేసింది. అయితే గస్తీ కాస్తున్న టాస్క్ఫోర్సు బృందాలను కూడా తికమపెడుతూ చొరబాటు జాలర్లు తీవ్ర గందరగోళం సృష్టించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande