మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఏపీ.ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ భేటీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఏపీ.ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ భేటీ
pawan


అమరావతి, 30 జూన్ (హి.స.)

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్తోఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ముంబైలో ఈరోజు (మంగళవారం) భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై ఈ సమావేశంలో ఇరువురు నేతలు చర్చించారు. ఆంధ్రప్రదేశ్కి రెండు ఆడపులులు ఇస్తున్నందుకు ఫడణవీస్కి.. పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరు మాట్లాడారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి ఏపీకి రెండు ఆడపులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని ఈ సమావేశంలో వారు నిర్ణయం తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande