వైసిపి హయాంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిధుల దుర్వినియోగం
వైసిపి హయాంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిధుల దుర్వినియోగం
వైసిపి హయాంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిధుల దుర్వినియోగం


అమరావతి, 30 జూన్ (హి.స.)

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి )హయాంలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలోచేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చేపట్టిన కొన్ని ఇంజినీరింగ్ పనుల్లో నిబంధనల ఉల్లంఘనలు, ఆర్థిక అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం శ్రీశైలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పలు పనుల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్స్పందించారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన ఇంజినీరింగ్ పనులకు సంబంధించి బాధ్యులైన ఇంజినీర్లు, అప్పటి ఎగ్జిక్యూటివ్ అధికారులపై ll చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ అధికారులు నిర్వహించిన పరిశీలనలో పనుల అమలు, అంచనాలు, చెల్లింపుల ప్రక్రియల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీనిపై పూర్తి నివేదిక ఆధారంగా సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు.

అదేవిధంగా, పనుల అమల్లో చోటుచేసుకున్న లోపాల కారణంగా సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి రూ.8.5 లక్షలు వసూలు చేయాలని కమిషనర్ రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిధుల వినియోగంలో బాధ్యతారాహిత్యం, నిబంధనల ఉల్లంఘనలను ఉపేక్షించబోమని కమిషనర్ రామచంద్రమోహన్ స్పష్టంచేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande