అక్టోబర్ 24,25 తేదీల్లో .చైనా రాజధాని షాంఘై లో తెలుగు సాహితీ సదస్సు
అక్టోబర్ 24,25 తేదీల్లో .చైనా రాజధాని షాంఘై లో తెలుగు సాహితీ సదస్సు
అక్టోబర్ 24,25 తేదీల్లో .చైనా రాజధాని షాంఘై లో తెలుగు సాహితీ సదస్సు


విశాఖపట్నం, 30 జూన్ (హి.స.)

తెలుగు సాహితీ సదస్సును చైనా రాజధాని షాంఘై నగరంలో అక్టోబరు 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు, లోక్నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఏయూలోని హిందీ భవన్లో ఉదయం ఆయన మాట్లాడుతూ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, షాంఘై తెలుగు సంఘం సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ సదస్సుకు తెలుగు భాష, సాహిత్యాభిమానులంతా ఆహ్వానితులేనని పేర్కొన్నారు.

ఇప్పటివరకు అమెరికా, ఇంగ్లండ్, సింగపూర్, మలేషియా, ఖతార్ వంటి దేశాల్లో తెలుగు సాహితీ సదస్సులు నిర్వహించామని తెలిపారు. చైనాలో ఇప్పటి వరకు హిందీ భాషకు సంబంధించి మాత్రమే ఈ తరహా సదస్సులు జరిగాయని, తొలిసారి తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సదస్సుకు తాను ప్రధాన సలహాదారుడిగా వ్యవహరిస్తున్నానని, హైదరాబాద్కు చెందిన రామరాజు సలహాదారుడిగా ఉన్నట్టు తెలిపారు. సమావేశంలో లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు ఏవీఎల్ నరసింహరావు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande