
కృష్ణా జిల్లా:, 30 జూన్ (హి.స.)
జిల్లాలోని బీబీగూడెం వద్ద ఉన్న పశ్చిమ బైపాస్ రోడ్డులో ఈరోజు(మంగళవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కంటైనర్.. కారును వెనక నుంచి ఢీకొట్టడంతో.. ముందున్న ట్యాంకర్ను ఆ కారు బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో కంటైనర్, ట్యాంకర్ మధ్యలో కారు నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి చనిపోవడం తీవ్రంగా కలిచివేసింది. ఇదే ప్రమాదంలో ఎదురుగా వెళ్తున్న బైక్ను కూడా ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా దుర్మరణం చెందాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ