రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటన.,,.భద్రతా ఏర్పాట్లు పరిశీలన
రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటన.,,.భద్రతా ఏర్పాట్లు పరిశీలన
/cm-chandrababu-naidu-to-visit-nellore-district-on-jul


గూడూరు, 30 జూన్ (హి.స.)ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు జూలై 1న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం సీఎం చంద్రబాబు నాయుడు గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు మండలం, పునపరివారి పాలెంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

ఇందుకోసం జిల్లా యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

ఇవాళ గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తో కలిసి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా , జిల్లా ఎస్పీ డాక్టర్ రజిత వేజెండ్ల లు, సీఎం పర్యటించే ప్రాంతాన్ని పరిశీలించారు.

సిఎం ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ , ప్రజా వేదిక ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

అనంతరం పునపరివారిపాలెం నుండి గూడూరు వరకు కొత్తగా ఏర్పాటు చేసిన బస్సు సర్వీసును జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ.. సీఎం ప్రోగ్రాం ను విజయవంతం చేసినందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత రెండేళ్లుగా గూడూరు నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, పరిశ్రమల రాకతో నిరుద్యోగులకు స్థానికంగా ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయన్నారు. సీఎం టూర్ ను సక్సెస్ చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానిక అధికారులకు కలెక్టర్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande