శ్రీ సత్యసాయి జిల్లాలో ఖరీఫ్ సాగు, ఎరువుల లభ్యతపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష
శ్రీ సత్యసాయి జిల్లాలో ఖరీఫ్ సాగు, ఎరువుల లభ్యతపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష
పుట్టపర్తి జిల్లాలో ఖరీఫ్ సాగు, ఎరువుల లభ్యతపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష


పుట్టపర్తి, 30 జూన్ (హి.స.): పంటల మార్పిడి, సహజసిద్ధ వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాలని, వేరుశనగ ఇతర ప్రత్యామ్నాయ పంటల విత్తనాల పంపిణీ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ఖరీఫ్-2026 సాగు ప్రణాళికలు, ఎరువులు-విత్తనాల లభ్యత, ఎల్ నినో ప్రభావంపై ముందస్తు సన్నద్ధతపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ సమర్పించిన సమగ్ర నివేదికలు, కార్యాచరణ ప్రణాళికలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఖరీఫ్ సాగుకు, ముఖ్యంగా ప్రాథమిక భూమి దుక్కుల తయారీ, సకాలంలో విత్తనాలు చల్లుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయన్నారు. ఖరీఫ్-2026 కోసం జిల్లాలో 1,19,414 హెక్టార్ల సాధారణ వైశాల్యానికి గాను 1,00,000 హెక్టార్లలో వేరుశనగ సాగును ప్రతిపాదించడం జరిగింది. దీనికోసం 72,289 క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేయగా, ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల (RSK) ద్వారా అర్హులైన రైతుల నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ఇప్పటివరకు 41,313 మంది రైతులు నమోదు చేసుకున్నారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande