జాతీయ రహదారిపై స్వచ్ఛత పనులు.. కమిషనర్ స్వయంగా పర్యవేక్షణ!
జాతీయ రహదారిపై స్వచ్ఛత పనులు.. కమిషనర్ స్వయంగా పర్యవేక్షణ!
municipal-commissioner-challa-obulesu-inspects-sanitation-


కర్నూలు, 30 జూన్ (హి.స.)కర్నూలు నగరంలోకి ప్రవేశించే వారికి నగర స్వచ్ఛత, అందం తొలి చూపులోనే కనిపించేలా నగర ప్రవేశ ద్వారాలు పరిశుభ్రతకు అద్దం పట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు.

ఈ రోజు మంగళవారం ఉదయం నగర పరిధిలోని ఎన్హెచ్-44 జాతీయ రహదారి సర్వీస్ రోడ్లపై జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. న్యూ కృష్ణనగర్, రామచంద్రనగర్, గుత్తి పెట్రోల్ బంక్, షరీన్నగర్ తదితర ప్రాంతాల్లో స్వచ్ఛత పనులను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించి చేపట్టించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోకి వచ్చే వారికి తొలి అభిప్రాయం కలిగించే ప్రాంతాలు ప్రవేశ ద్వారాలేనని, వాటి పరిశుభ్రత, సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ ప్రాంతాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వాహనం, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ప్రధాన రహదారులు, సర్వీస్ రోడ్ల వెంట చెత్త, మురుగు నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి సర్వీస్ రోడ్లపై చెత్త పేరుకుపోకుండా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని, రోడ్ల పక్కన పెరిగిన కలుపు మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం కమిషనర్ కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande