భారత్తో సరిహద్దు వివాదానికి దౌత్య మార్గంలో పరిష్కారం కోరుతున్నాం: నేపాల్ విదేశాంగ మంత్రి
భారత్తో సరిహద్దు వివాదానికి దౌత్య మార్గంలో పరిష్కారం కోరుతున్నాం: నేపాల్ విదేశాంగ మంత్రి
భారత్తో సరిహద్దు వివాదానికి దౌత్య మార్గంలో పరిష్కారం కోరుతున్నాం: నేపాల్ విదేశాంగ మంత్రి

దిల్లీ, 07 జూన్ (హి.స.)

భారత్తో కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించాలని నేపాల్ కోరుకుంటోందని ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. ఇరు దేశాలు ఓపెన్ హార్ట్తో ఒకే టేబుల్పై కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కరించలేని సమస్య ఏదీ ఉండదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం భారత్ను 21వ శతాబ్దపు భౌగోళిక రాజకీయాల కోణంలో కాకుండా, పరస్పర అభివృద్ధికి భాగస్వామిగా చూస్తోందని చెప్పారు. నేపాల్ ఆర్థిక పరివర్తన, ప్రజల సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదివారం దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande