రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
pention


అనకాపల్లి, 01 జూలై (హి.స.)

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు మంత్రులు, అధికారులు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పాత పెద్దిరెడ్డి వారి వీధిలో హోం మంత్రి అనిత పెన్షన్లను పంపిణీ చేశారు. వర్షంలో కూడా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాయకరావుపేట వార్డుల్లో పర్యటించిన అనిత.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande