
నెల్లూరు,, 01 జూలై (హి.స.)
:పేదలను ఆనందంగా చూడాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(బుధవారం) పున్నపువారిపాలెంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో సీఎం మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామని.. 62.20 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. 28 కేటగిరీలకు పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. పేదల జీవితాల్లో శాశ్వతంగా వెలుగులు తీసుకువస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని అన్నారు. ‘నేను బటన్ నొక్కే వ్యక్తిని కాదు.. ప్రజల్లో ఉండే వ్యక్తిని’ అని స్పష్టం చేశారు. ఒక నెలలో తీసుకోకపోయినా..3 నెలలకు ఒకేసారి పెన్షన్ ఇస్తున్నామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ