తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దు.. నితిన్ నబీన్కు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్
తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దు.. నితిన్ నబీన్కు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్
Mahesh Kumar


హైదరాబాద్, 01 జూలై (హి.స.)

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన అట్టర్ ప్లాప్ అయిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీకి తెలంగాణలో అవకాశం లేదని ఆ పార్టీ అవసరం ఇక్కడ లేదన్నారు. మూడు రోజుల పర్యటనలో నితిన్ నబీన్ ఏం చేశారు? రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పరిస్థితుల మీద, కుల సమీకరణలు, ఉద్యమం మీద ఆయనకు అవగాహన ఉందా? అని నిలదీశారు. బీజేపీ ముక్త్ భారత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాకారం అయిందని వేల మంది ప్రాణ త్యాగం వల్ల రాష్ట్రం సాకారం అయిందని చెప్పారు. నిన్నే సీఎం రేవంత్ రైతు భరోసా విడుదల చేశారని తెలంగాణ ప్రజలా గుండెల్లో కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా ఉండిపోతుందన్నారు. బీజేపీ చెబుతున్న వికసిత్ భారత్లో లో తెలంగాణ లేదా? రెండు కోట్ల ఉద్యోగాలు పేరిట మోసం చేయలేదా? అని నిలదీశారు. సంపన్న వర్గం కోసమే కేంద్రం పని చేస్తోందని అయోధ్య దోపిడి గురించి, కాళేశ్వరం స్కామ్ పై సీబీఐ దర్యాప్తు పై నబీన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణలో మత వైషమ్యాలకు తావులేదని మత చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే సాధ్యం కాదన్నారు. మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ అన్నారు. బీహాలో౯ ఓటు దొంగిలిస్తే మీనాక్షి నటరాజన్ విషయంలో ఏకంగా సీటు చోరీ చేశారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సర్ కార్యక్రమం ఓట్ల జత కోసం అయితే అది కాస్త ఇపుడు ఓట్ల తొలగింపుకార్యక్రమంలా మారిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande