
చిత్తూరు, 01 జూలై (హి.స.) సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. జూలై 3 నుంచి 5వ తేది (మూడు రోజులు) కుప్పంలో ఉండనున్నారు. ఈ పర్యటన వివరాలను కలెక్టర్ సుమిత్కుమార్ ఈ రోజు ఉదయం విడుదల చేశారు.
తొలిరోజైన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గుడుపల్లె మండలం ద్రవిడ వర్సిటీలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. స్థానిక అధికార, అనధికారులతో సమావేశమవుతారు. పొగురుపల్లి పారిశ్రామికవాడలో అబీస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీఐఐసీ ఎంఎ్సఎంఈ పార్కులో పరిశ్రమలను ప్రారంభిస్తారు. 200 మందికి ఉద్యోగ ఆఫర్ లెటర్లు అందజేస్తారు. ఇక, రామకుప్పం, పొగురుపల్లి, శాంతిపురంలో మూడు పవర్ సబ్స్టేషన్లకు, ఇస్కాన్ టెంపుల్కు, గ్రానైట్ హెరిటేజ్ స్టోన్ క్లస్టర్కు అక్కడే ప్రారంభోత్సవాలు చేస్తారు. రూఫ్టాప్ సోలార్నూ ప్రారంభిస్తారు. కొన్ని కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు పారిశ్రామికవాడలో జరిగే సభలో ప్రసంగిస్తారు. ‘స్వర్ణ కుప్పం - స్వచ్ఛ కుప్పం’లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలో ఈ-సైకిల్స్, ఈ-ఆటోలు, ఈ-ట్రాక్టర్ల, ఈవీ చార్జింగ్ స్టేషన్ల లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. 6 గంటలకు 28 పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమవుతారు. తర్వాత శాంతిపురం మండలంలోని ఇంటికి చేరుకుంటారు.
4వ తేది ఉదయం కుప్పం మండలం శెట్టిపల్లిలో నెట్ జీరో మోడల్ హౌసె్సను సందర్శిస్తారు. అనంతరం కుప్పం ప్రభుత్వాస్పత్రిలో సీటీ స్కాన్, డయాలిసిస్ సెంటర్, హెల్త్ ఎగ్జిబిషన్ స్టాల్ను ప్రారంభిస్తారు. 11.20 గంటలకు గుడుపల్లి మండలం గుట్టార్లపల్లెలో కడా గెస్ట్ హౌస్ను ప్రారంభిస్తారు. 11.45 గంటలకు టీడీపీ పార్టీ కార్యాలయానికి చేరుకుని ‘జననాయకుడు గ్రీవెన్స్ సిస్టం’ను ప్రారంభిస్తారు. మధ్యాహ్న 12.10 గంటలకు పూలమార్కెట్లో ఫుడ్ప్లాజాకు చేరుకుంటారు. అక్కడ ఎల్పీజీ క్రెమిటోరియం (శ్మశానవాటిక)ను ప్రారంభిస్తారు. తర్వాత కుప్పం బస్టాండ్కు చేరుకుని మోడల్ బస్స్టేషన్, డిపోకు శంకుస్థాపన చేసి అక్కడి సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కంగుంది గ్రామానికి చేరుకుని 320 మంది లబ్ధిదారులకు అసైన్మెంట్ పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం శాంతిపురం మండలంలోని ఇంటికి చేరుకుని.. ఎస్జే్క్షఐఐటీ కాన్పూర్ ప్రతినిధులతో సమావేశమవుతారు.
5వ తేది (ఆదివారం) ఉదయం 10- 10.30 గంటలవరకు వినతిపత్రాలను స్వీకరించాక.. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జీరో పావర్టీ (పీ-4) స్టాల్ను సందర్శిస్తారు. 2 గంటలకు నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. శాంతిపురం మండలంలో ఏర్పాటు చేసిన పౌలీ్ట్ర షెడ్ను సందర్శించి, బహిరంగ సభలో మాట్లాడతారు. ఐటీసీసీఈఏ ప్రాజెక్టుతో ఎంవోయూ చేసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు హెలిప్యాడ్ నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV