కల్లూరు 19వ వార్డులో పండుగలా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!
కల్లూరు 19వ వార్డులో పండుగలా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!
panyam-mla-gauru-charitha-reddy-distributes-ntr-bharosa-pe


కర్నూలు:, 01 జూలై (హి.స.) కల్లూరు అర్బన్ 19వ వార్డు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్-భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరితరెడ్డి గారు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి, 19వ వార్డు ఇన్చార్జ్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్,ఏపీ డైరెక్టర్ మహాముని, మైనారిటీ నాయకులు చాంద్ పాష, కరిష్, బీజేపీ నాయకులుధనలక్ష్మి, దుర్గయ్య, వీరప్ప, రవి తేజ, రామకృష్ణ రెడ్డి మరియు సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande