అనంతపురంలో రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ!
అనంతపురంలో రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ!
/pension-distribution-record-level-mla-daggupati-prasad-16


అనంతపూర్, 01 జూలై (హి.స.) : ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ జరుగుతోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.

అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు.

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు పింఛన్లు అందిస్తున్నారని ఆయన తెలిపారు.అనంతపురం నగరంలో పింఛన్ల పంపిణీ పండుగలా సాగింది.

అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఇంటింటికీ వెళ్తూ లబ్ధిదారులను కలుసుకున్నారు.

వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు అందజేస్తూ.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 1వ తేదీ ఆదివారం వస్తే.. ఒక రోజు ముందే పింఛన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. తొలి రోజే ఏకంగా 95 శాతం మందికి పింఛన్లు అందుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande