జమ్మూకశ్మీర్లో భారీ వర్షాల బీభత్సం.. వరద ముప్పుతో హై అలర్ట్!
జమ్మూకశ్మీర్లో భారీ వర్షాల బీభత్సం.. వరద ముప్పుతో హై అలర్ట్!
Jammu Kashmir


జమ్మూ కాశ్మీర్, 19 జూలై (హి.స.)

రుతుపవనాల కారణంగా జమ్మూ

కశ్మీర్ లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లు జలమయం కాగా, కొండ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం గడుపుతుండగా.. రాజౌరీ జిల్లాకు వరద ముప్పు ఉందని అధికారులు అంచనా వేస్తూ.. హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే నిరంతరాయంగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వరద లాంటి భీకర పరిస్థితులు తలెత్తాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల వల్ల వరద నీరు వేగంగా వచ్చి చేరి జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తింది. ఇళ్లలోకి, రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో సాధారణ జనజీవనం తో పాటు రవాణా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది. పర్వత ప్రాంతాల నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చే ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉండటంతో స్థానిక నివాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. ప్రజలు ఎవరూ కూడా ప్రస్తుతం అనవసర ప్రయాణాలు చేయొద్దని, ముఖ్యంగా నదులు, కాలువలు, కొండ వాగులు, వరదలు వచ్చే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు అస్సలు వెళ్లవద్దని కోరింది. నదీ తీరాల వెంబడి నివసిస్తున్న కుటుంబాలు నది మట్టాలు నిరంతరం పెరుగుతున్నందున అత్యంత అప్రమత్తంగా ఉండాలని, విపత్తు సహాయక చర్యల కోసం అధికార యంత్రాంగం పూర్తిగా అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande