జమ్మూకాశ్మీర్లో IMD రెడ్ అలర్ట్.. వైష్ణోదేవి యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పర్యాటకంగా కీలక నిర్ణయం వెలువడింది.
జమ్మూకాశ్మీర్లో IMD రెడ్ అలర్ట్.. వైష్ణోదేవి యాత్ర తాత్కాలికంగా నిలిపివేత


శ్రీనగర్, 19 జూలై (హి.స.)జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పర్యాటకంగా కీలక నిర్ణయం వెలువడింది.

జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir)లో రాబోయే వారం, పది రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన తుఫానులు, హఠాత్తుగా వరదలు (Flash Floods), కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలకు రెడ్ అలర్ట్ (Red Alert) కూడా జారీ చేసింది. అదేవిధంగా మరోవైపు వైష్ణోదేవి యాత్ర (Vaishno Devi Yatra)కు వెళ్లాలనుకుంటున్న భక్తులకు భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, భక్తుల భద్రత దృష్ట్యా జూలై 19 నుంచి వైష్ణోదేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. కొండ ప్రాంతంలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డు నిర్ణయం తీసుకుంది. వాతావరణం అనుకూలించిన తర్వాత, భద్రతా తనిఖీలు పూర్తయిన వెంటనే యాత్రను తిరిగి పునరుద్ధరిస్తామని అధికారులువ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande