జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అత్యవసరంగా జమ్ముకి తిరిగి వెళ్లిన ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అత్యవసరంగా జమ్ముకి తిరిగి వెళ్లిన ఒమర్ అబ్దుల్లా
Omar Abdullah


జమ్మూ:, 19 జూలై (హి.స.)

జమ్మూ డివిజన్‌లోని పలు ప్రాంతాలలో, ముఖ్యంగా రాజౌరి మరియు పూంచ్ జిల్లాలలో శనివారం రాత్రి నుండి కురిసిన కుండపోత వర్షాల వల్ల అకస్మాత్తుగా వరదలు (Flash Floods) సంభవించి ఇప్పటివరకు 8 మంది మరణించగా, మరో ఆరుగురు గల్లంతయ్యారు. వాతావరణ శాఖ జారీ చేసిన తీవ్రమైన హెచ్చరికలు, క్షేత్రస్థాయిలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నమే తాను జమ్మూ చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలైన రాజౌరి పట్టణం మరియు పరిసర ప్రాంతాల పరిస్థితిని తాను ఆదివారం ఉదయం నుండే నిరంతరం గమనిస్తున్నానని, స్థానిక ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను రక్షించడానికే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, వర్షాలు మరియు వరదల వల్ల ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. మరోవైపు, జమ్మూ కాశ్మీర్‌కు సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శన యథావిధిగా కొనసాగుతుందని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమం పార్టీ అధినేత డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా నాయకత్వంలో ముందుకే సాగుతుందని ఆయన వెల్లడించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande