
న్యూఢిల్లీ, 19 జూలై (హి.స.)
: భారత దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యూరప్ ఖండంలోని మోల్డోవా, నార్త్ మాసిడోనియా, మరియు రొమేనియా దేశాలలో జూలై 19 నుండి 25 వరకు జరిగే అధికారిక పర్యటనల కోసం న్యూఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో ప్రయాణమయ్యారు. ఆయా దేశాల అధ్యక్షుల అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటనలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, విద్య మరియు ఆరోగ్య రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశంఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటగా మోల్డోవా చేరుకుంటారు. ఒక భారతీయ రాష్ట్రపతి ఈ తూర్పు యూరప్ దేశంలో పర్యటించడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. అక్కడ ఆమె మోల్డోవా అధ్యక్షురాలు మాయా శాందుతో పాటు ఆ దేశ పార్లమెంట్ ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత జూలై 21-22 తేదీల్లో నార్త్ మాసిడోనియాలో పర్యటిస్తారు; ఒక భారత రాష్ట్రపతికి ఇది కూడా తొలి పర్యటనే. పర్యటన చివరి దశలో భాగంగా జూలై 23 నుండి 25 వరకు రొమేనియాలో పర్యటిస్తారు. గత మూడు దశాబ్దాల కాలంలో (1994 తర్వాత) ఒక భారత రాష్ట్రపతి రొమేనియాకు వెళ్లడం ఇదే ప్రథమం కావడంతో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మూడు దేశాల్లోని వ్యాపార వేదికల సదస్సులలో పాల్గొనడంతో పాటు అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజంతో (Indian Community) కూడా రాష్ట్రపతి ముఖాముఖిగా మాట్లాడనున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi