పేదరిక నిర్మూలనలో భాగంగా వికసిత్ భారత్ జీరామ్జీ తీసుకొచ్చాం: పవన్కల్యాణ్
పేదరిక నిర్మూలనలో భాగంగా వికసిత్ భారత్ జీరామ్జీ తీసుకొచ్చాం: పవన్కల్యాణ్
pawan


తిరుపతి, 02 జూలై (హి.స.)

పేదరిక నిర్మూలనలో భాగంగా వికసిత్‌ భారత్‌ జీరామ్‌జీ తీసుకొచ్చామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీ జీరాంజీ కార్యక్రమం తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె వేదికగా నేడు ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్​ మాట్లాడుతూ ఏపీ గ్రామీణాభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తోందన్నారు.

ప్రధాని మోదీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలియజేశారు. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ముఖ్యమైందని పవన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్‌లో 60 రోజులు విరామం రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం రూ.12,845 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పవన్‌ వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande