
మెదక్, 02 జూలై (హి.స.)
జిల్లాలో సంపూర్ణంగా వరి ధాన్యం కొనుగోళ్లు (Paddy Procurement ) విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ( Collector Pratima Singh) వెల్లడించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు . జిల్లా చరిత్రలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది యాసంగిలో రైతులు గతంలో కంటే 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించారని వివరించారు.
జిల్లాలో 4,28,361 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ పూర్తి అయిందన్నారు. రైతుల అకౌంట్లలో రూ. 1005.66 కోట్లను జమ చేశామన్నారు. 1,01,752 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ చేశామని వివరించారు. ఏప్రిల్ 08 న ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు జూన్ 27వ తేదీకి పూర్తి చేశామన్నారు. జిల్లాలో మొత్తం 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, పీఏసీఎస్ -305, ఐకేపీ-185, డీసీఎంఎస్- 43 కేంద్రాల ద్వారా కొనుగోలు జరిపామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..