ప్రయోగానికి విక్రమ్-1 రాకెట్ సిద్ధం.. చరిత్ర సృష్టించనున్న హైదరాబాదీ స్టార్టప్
ప్రయోగానికి విక్రమ్-1 రాకెట్ సిద్ధం.. చరిత్ర సృష్టించనున్న హైదరాబాదీ స్టార్టప్
space


హైదరాబాద్, 02 జూలై (హి.స.)భార‌తీ అంత‌రిక్ష రంగంలో.. హైద‌రాబాద్ కంపెనీ కొత్త పుంత‌లు తొక్క‌నున్న‌ది. న‌గ‌రానికి చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ రూపొందించిన విక్ర‌మ్‌-1(Vikram-1) రాకెట్ త్వ‌ర‌లో నింగికి ఎగ‌ర‌నున్న‌ది. తొలిసారి దేశంలో ఓ ప్రైవేటు కంపెనీ.. ఆర్బిటాల్ క్లాస్ రాకెట్‌ను డెవ‌ల‌ప్ చేసింది. విక్ర‌మ్‌-1 రాకెట్ టెస్ట్ ఫ్ల‌యిట్‌కు మిష‌న్ ఆగ‌మ‌న్ అని పేరు పెట్టారు. ప్ర‌స్తుతం శ్రీహ‌రి కోట‌లోని స‌తీశ్ ధావ‌న్ సెంట‌ర్‌లో ఉన్న ఫ‌స్ట్ లాంచ్ ప్యాడ్‌లో ఆ రాకెట్ సిద్ధంగా ఉన్న‌ది.

జూలై 12 నుంచి ఆగ‌స్టు 4వ తేదీ మ‌ధ్య ఈ రాకెట్‌ను ప్ర‌యోగించే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌తంలో భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ‌లో ప‌నిచేసిన ఇంజినీర్లు ఈ స్కైరూట్ కంపెనీని స్థాపించారు. రాకెట్ ల్యాబ్ కంపెనీ త‌ర‌హాలో స్కైరూట్ చిన్న త‌ర‌హా రాకెట్ల‌ను నిర్మిస్తున్న‌ది.

ఏడంత‌స్తుల ఎత్తు ఉండే విక్ర‌మ్‌-1 రాకెట్‌ను మ‌ల్టీస్టేజ్ లాంచ్ వెహికిల్‌గా రూపొందించారు. దిగువ భూ-క‌క్ష్య‌లోకి సుమారు 350 కిలోగ్రాముల పేలోడ్‌ను ఈ రాకెట్ మోసుకెళ్తుంది. భార‌త్‌కు చెందిన బిలియ‌న్ డాల‌ర్ల స్పేస్ స్టార్ట‌ప్‌గా స్కైరూట్ న‌మోదు అయ్యింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande