
నంద్యాల, 02 జూలై (హి.స.) నంద్యాల జిల్లా డోన్ హైవేపై గురువారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. పందుల లోడ్ తో వెళ్తున్న వాహనాన్ని గుర్తించి ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా.. దుండగులు ఎదురు తిరిగారు. వాహనాన్ని ఆపకుండా ఓవర్ స్పీడ్ తో వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని వెంబడిస్తూనే హైవే పెట్రోలింగ్ పోలీసులకు సమాచారమిచ్చారు. పందుల వాహనాన్ని అడ్డుకునేందుకు పెట్రోలింగ్ పోలీసులు యత్నించగా.. పోలీసులపై, వాహనంపై రాళ్లు, సీసాలు విసిరి దాడిచేశారు. ఇక చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు దొంగలపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో హైవే పెట్రోలింగ్ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. దుండగులు పోలీసులకు చిక్కకుండా పరారవ్వగా.. ప్యాపిలి వద్ద అడ్డుకునేందుకు మరోసారి ట్రై చేశారు. అక్కడి నుంచి కూడా దొంగలు తప్పించుకుని పారిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV