
ముంబై, 20 జూలై (హి.స.)పసిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు వరుస షాక్లు ఇస్తున్నాయి.గత రెండ్రోజులుగా ఈ ఆభరణాల ధరలు బ్రేకుల్లేని బండిలా పరుగులు పెడుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం కూడా బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్, రూపాయి విలువ మారకం ప్రభావంతోనే బంగారం, వెండి ధరల్లో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,460గా ఉండగా నిన్న ఈ ధర రూ..1,43,290 వద్ద స్థిరపడింది. అంటే తులం బంగారంపై రూ.170 పెరిగింది. ఇక 22 క్యాటర్ల బంగారం ధర చూసుకుంటే.. రూ.1,31,500 వద్ద ట్రేడవుతుంది. నిన్నటితో పోల్చుకుంటే దీని ధర రూ.150 పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే.. రూ. 2,34,900గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,460, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,500 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,43,460, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,31,500 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,43,610, 22 క్యారెట్ల ధర రూ.1,31,650 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,35,000 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,43,460, 22 క్యారెట్ల ధర రూ.1,31,500 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV