బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
gold


ముంబై, 21 జూలై (హి.స.)బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం మరోసారి ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతో పసిడి ధరల్లో ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. బంగారం ధరల పెరుగుదలలో క్రూడ్ ఆయిల్ ధరలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మంగళవారం గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం

హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,220 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.760 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,32,200గా ట్రేడవుతోండగా.. నేడు రూ.700 మేర పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,44,220 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,32,200గా కొనసాగుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,220 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,200 వద్ద ట్రేడవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande