గుంటూరు నగరంలో. మురుగునీటి నిర్వహణ అస్త వ్యస్తం
గుంటూరు నగరంలో. మురుగునీటి నిర్వహణ అస్త వ్యస్తం
మురుగునీరు


అమరావతి, 03 జూలై (హి.స.)

గుంటూరు నగరంలో మురుగునీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఏళ్ల తరబడి పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా వ్యర్థ జలాల శుద్ధి అటకెక్కింది. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అసంపూర్తిగా మారడం.. ఉన్న ప్లాంటు మొక్కుబడిగా సాగుతుండడంతో కాలుష్య రహిత నగరం అన్న మాట కాగితాలకే పరిమితమవుతోంది. శుద్ధికాని మురుగునీరంతా నల్లమడ వాగు, నిజాంపట్నం కాలువ ద్వారా బంగాళాఖాతంలో కలుస్తోంది. పర్యావరణానికే కాకుండా ప్రజారోగ్యానికీ పెనుముప్పుగా పరిణమిస్తోంది.తక్షిణమే మురుగునీరు నిర్వహణను చేపట్టి నీరు కలిషితం కాకుండా చూడాలని ప్రజలు కోర్కుంటున్నారు. వర్షాలు పడుతుండడంతో ఈ సమస్య మరింత తీవ్రంగా బాధిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande