ఘట్కేసర్ దగ్గర విషాద సంఘటన.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
ఘట్కేసర్ దగ్గర విషాద సంఘటన.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
Suicide


హైదరాబాద్, 03 జూలై (హి.స.)

రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య

చేసుకున్న ఘటన ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట చెందిన దంపతులు రవికుమార్, శిరీష దంపతులు పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో నివాసముంటున్నారు. గురువారం రాత్రి ఘట్కేసర్ నుంచి బీబీనగర్ వైపు వెళ్లే రైల్వే మార్గంలోని ఎన్ఎఫ్సీ సమీపంలో రైలు కిందపడి రవికుమార్, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande