
చింతలపూడి:, 03 జూలై (హి.స.)
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత అని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్ అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. వారి సమస్యలు విన్న ఎమ్మెల్యే.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, సత్వర పరిష్కారం చూపడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ