మళ్లీ 2028లో వస్తా.. ఉత్పత్తి ప్రారంభిస్తా: సీఎం చంద్రబాబు (update)
మళ్లీ 2028లో వస్తా.. ఉత్పత్తి ప్రారంభిస్తా: సీఎం చంద్రబాబు
చంద్రబాబు


జమ్మలమడుగు, 03 జూలై (హి.స.) మళ్లీ వస్తానని 2028 జులై 3న జిందాల్ స్టీల్ ప్లాంట్(jindal Steel Plant) రెండో దశ పనులను ప్రారంభిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు(Jammalamadugu)లో జిందాల్ స్టీల్ ప్లాంట్ తొలి దశ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమ(Rayalaseema)ను రాళ్ల సీమను కానివ్వమని, రతనాల సీమ చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగిందో ప్రజలు గుర్తించాలని సూచించారు. కియా పరిశ్రమతో అనంతపురం రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. ఇప్పటి వరకూ రూ. 19 లక్షల కార్లు తయారయ్యాయని తెలిపారు.

స్టీల్ ప్లాంట్ పేరుతో ఐరన్ ఓర్ స్మగ్లింగ్

గత ప్రభుత్వంలో స్థానికులు 17 వేల ఎకరాల భూమి ఇచ్చారని, అయితే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్(Brahmani Steel Plant) వచ్చిందా అని ప్రశ్నించారు. కానీ స్టీల్ ప్లాంట్ పేరుతో ఐరన్ ఓర్ను స్మగ్లింగ్ చేశారని మండిపడ్డారు.వాళ్ల జేబులు నిండాయి కానీ, ప్రజలకు ఉపయోగపడలేదని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు.

కూటమి ప్రభుత్వంలో రాయలసీమకు ఇప్పటివరకూ రూ. 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. సీమ వనరులతో ఫ్యాక్టరీలు నిర్మించి స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టు ద్వారా రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులను, స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని ఆదేశించానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande