
వరంగల్, 03 జూలై (హి.స.) వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ భూముల వేలంలో రూ.50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నాయకుల ఆరోపించారు. దీనిపై ప్రస్తుత కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి భద్రకాళి గుడిలో ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించిన మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు ఆలయానికి వస్తుండగా వారిని పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi