అయోధ్య రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై విపక్షాల భారీ నిరసన: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
అయోధ్య రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై విపక్షాల భారీ నిరసన: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
PARLIAMENT-WOMEN-RESERVATION-BILL-DEBATE


న్యూఢిల్లీ:, 31 జూలై (హి.స.)

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు ఉదయం లోక్‌సభలో విపక్షాలు భారీ నిరసనలకు దిగాయి. అయోధ్య రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగం జరిగిందంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు రాహుల్ గాంధీ నాయకత్వంలో వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ ఆందోళనల్లో భాగంగా ఎంపీ పప్పూ యాదవ్ స్వామీజీ గెటప్‌లో సభలోకి వచ్చి చందాలు అడగగా, రాహుల్ గాంధీ హుండీలో డబ్బులు వేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. విపక్ష ఎంపీల నినాదాలు, ఈ వినూత్న నిరసనల కారణంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఉభయ సభల్లోనూ గలాటా సర్దుమణగలేదు. దీంతో స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నానికి వాయిదా వేయగా, రాజ్యసభ ఆగస్టు 3 (సోమవారం) వరకు వాయిదా పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande