19 ఏళ్ల తర్వాత కోల్కతా చేరుకున్న బంగ్లాదేశీ రచయిత తస్లీమా నస్రీన్
19 ఏళ్ల తర్వాత కోల్కతా చేరుకున్న బంగ్లాదేశీ రచయిత తస్లీమా నస్రీన్
taslima


కోల్‌క‌తా :, 31 జూలై (హి.స.)

1993లో త‌స్లీమా రాసిన ల‌జ్జ అనే న‌వ‌ల్ చాలా ఫేమ‌స్ అయ్యింది. దాంతో ఆమెకు అంత‌ర్జాతీయ గుర్తింపు వ‌చ్చింది. బాబ్రీ మ‌సీదు కూల్చివేత త‌ర్వాత బంగ్లాదేశ్‌లో హిందువుల‌ను ఊచ‌కోత కోశారు. ఆ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ఆమె ఆ బుక్‌లో రాశారు. ఆ బుక్‌ను బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేశారు. ఇస్లామిస్ట్ గ్రూపులు ఆమెను బెదిరించారు. దీంతో 1994లో ఆమె దేశం విడిచి పారిపోయారు.ఆ త‌ర్వాత అనేక దేశాల్లో ఆమె త‌ల‌దాచుకున్నారు. 2004లో భార‌త ప్ర‌భుత్వం నుంచి తాత్కాలిక నివాసం కోసం అనుమ‌తి రావ‌డంతో ఆమె కోల్‌క‌తా చేరుకున్నారు. కోల్‌క‌తా త‌న‌కు రెండో ఇళ్లు అని ఆమె అన్నారు. ఆటోబ‌యోగ్రఫీ ద్విఖందితో వివాదం కావ‌డంతో ముస్లిం సంఘాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి.

2007 నవంబ‌ర్‌లో కోల్‌క‌తాలో తీవ్ర స్థాయిలో హింసాత్మ‌క ఆందోళ‌న‌లు జ‌రిగాయి. అప్పుడు అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ప్ర‌భుత్వం ఆమెను మ‌రోచోటుకు త‌ర‌లించింది. అక్క‌డ నుంచి జైపూర్‌కు ఆ త‌ర్వాత యూరోప్ వెళ్లిపోయింది. ఆమెపై ఇండియాలో బ్యాన్ లేదు. కానీ కోల్‌క‌తాలో జ‌రిగే సాహిత్య ఈవెంట్ల‌కు అనుమ‌తి ద‌క్క‌లేదు. బెంగాల్‌తో సాంస్కృతిక‌, భాష‌ప‌ర‌మైన సంబంధాలు ఉన్న కార‌ణంగా.. కోల్‌క‌తాలో ప‌ర్మ‌నెంట్‌గా సెటిల్ కావాల‌ని భావిస్తున్న‌ట్లు ఆమె అనేక సార్లు చెప్పారు. త‌స్లీమా న‌స్రీన్ ఇండియాలో జీవించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింద‌ని బీజేపీ ఎమ్మెల్యే సౌర‌వ్ సిక్దార్ తెలిపారు. 1992, 2000 సంవ‌త్స‌రాల్లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆనంద్ పుర‌స్కారాన్ని ఆమె అందుకున్నారు

బంగ్లాదేశీ ర‌చ‌యిత‌, సామాజిక కార్య‌క‌ర్త‌ర త‌స్లీమా న‌స్రీమ్‌(Taslima Nasreen).. సుమారు 19 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ కోల్‌క‌తాకు చేరుకున్నారు. త‌స్లీమా ర‌చ‌న‌ల‌ను వ్య‌తిరేకిస్తూ 2007లో బెంగాల్‌లో నిర‌స‌న‌లు జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో ఆమెను సిటీ నుంచి బ‌ల‌వంతంగా వెళ్ల‌గొట్టారు. అయితే 19 ఏళ్ల బ్రేక్ త‌ర్వాత ఇవాళ ఆమె కోల్‌క‌తాకు వ‌చ్చారు. భారీ భ‌ద్ర‌త న‌డుమ నేతాజీ సుభాష్ చంద్ర‌బాస్ విమానాశ్రయానికి ఆమె చేరుకున్నారు. మాన‌వ హ‌క్కుల సంఘాలు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో ఆమె పాల్గోనున్నారు. బంగ్లాదేశ్‌లోని మిమెన్‌సింగ్‌లో ఆమె 1962లో జ‌న్మించారు. ఫిజీషియ‌న్ అయిన ఆమె ర‌చ‌యిత కూడా. న‌వ‌ల‌లు, వ్యాసాలు, మెమోయిర్స్ రాశారు. మ‌హిళ‌ల హ‌క్కులు, సెక్యూల‌రిజం, భావ స్వేచ్ఛ‌, మ‌త‌ఛాంద‌స‌వాదుల‌ను విమ‌ర్శిస్తూ ఆమె చాలా రాశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande