ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు నేడే ఆఖరి రోజు: గడువు దాటితే ప్రభుత్వ ప్రయోజనాలకు గండం
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు నేడే ఆఖరి రోజు: గడువు దాటితే ప్రభుత్వ ప్రయోజనాలకు గండం
tax


న్యూఢిల్లీ:, 31 జూలై (హి.స.)

ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి ఈరోజు (జులై 31) చివరి తేదీ అని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. గడువు పొడిగించే యోచన లేకపోవడంతో పన్ను చెల్లింపుదారులు ఈ రాత్రి లోపు తమ ఐటీఆర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత ఆలస్యంగా జీరో ఐటీఆర్ ఫైల్ చేసినా సరే, నిబంధనల ప్రకారం భారీ పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.దీనితో పాటు గడువు దాటిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రేషన్ కార్డులు, వివిధ ప్రభుత్వ సబ్సిడీలు మరియు పింఛన్ల (Pensions) వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బ్యాంకు రుణాలు, వీసా దరఖాస్తులకు ఐటీఆర్ కీలకమైనందున ఎలాంటి జరిమానాలు మరియు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వెంటనే రిటర్నులు దాఖలు చేసుకోవాలని పన్ను విభాగం సూచిస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande