పల్నాడు.జిల్లాలో విషాదకర ఘటన
పల్నాడు.జిల్లాలో విషాదకర ఘటన
hang


పల్నాడు జిల్లా, 05 జూలై (హి.స.)

,:పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో తండ్రి గొనుగుంట్ల పోతులూరయ్య (60), ఆయన కుమార్తె రామాంజమ్మ (39) వారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని పోలీసులకు కుటుంబ సభ్యులు, స్థానికులు సమాచారం అందించారు. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.

అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబంలో నెలకొన్న విభేదాలు, వ్యక్తిగత సమస్యలు ఈ ఘటనకు కారణమని గ్రామస్తులు, బంధువులు తెలిపారు. అయితే వారి మృతికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande